Ticker

6/recent/ticker-posts

ప్రో కబడ్డీ లీగ్ : తమిళ్ తలైవాస్ ఘన విజయం


 ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 32-25 పాయింట్లతో యు ముంబాను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆఖరి వరకు తలైవాస్ జోరు కొనసాగించింది.


ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 21-16 పాయింట్లతో తమిళ్ తలైవాస్ ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల రైడర్లు సమాన పాయింట్లు సాధించగా, యుముంబాను ఒక్కసారి ఆలౌట్ చేసి తలైవాస్ ముందంజలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లోనూ తమిళ్ జట్టు అదే జోరు ప్రదర్శించింది.


లీడ్‌ను కాపాడుకుంటూ సంయమనంతో ఆడుతూ తమిళ్ తలైవాస్ మ్యాచ్‌ను ఘనంగా ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో యు ముంబా ప్రతిఘటించడం, తలైవాస్ జాగ్రత్తగా ఆడటంతో ఏ జట్టు ఆలౌట్ కాలేదు. తలైవాస్ జట్టులో రైడర్ నరేందర్ సూపర్ 10తో అదరగొట్టాడు. కెప్టెన్, డిఫెండర్ సాహిల్ ఆరు పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్ జట్టులో రైడర్ గగన గౌడ (6 పాయింట్లు) టాప్ స్కోరర్.


ఈ విజయంతో 45 పాయింట్లకు చేరుకున్న తమిళ్ తలైవాస్ పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. 19 మ్యాచ్‌లు ఆడిన తలైవాస్‌కు ఇది ఎనిమిదో గెలుపు. మరోవైపు యు ముంబా 41 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. 18 మ్యాచ్‌లు ఆడిన ముంబా ఆరు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గింది. టేబుల్‌లో అట్టడుగన తెలుగు టైటాన్స్ ఉంది. 18 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే నెగ్గింది. కాగా, 72 పాయింట్లు సాధించిన జైపుర్ పింక్ పాంథర్స్, 71 పాయింట్లు సాధించిన పుణెరి పల్టాన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.


ఆఖరి ఉత్కంఠగా సాగిన ఈ పోరు 30-30 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో పుణెరి పల్టాన్‌కు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.