Ticker

6/recent/ticker-posts

IPL 2024: సన్‌రైజర్స్ బలహీనత అదొక్కటే..!


 ఆడింది పదకొండు సీజన్లు.. ఓ సారి చాంపియన్‌షిప్.. ఇంకోసారి రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం... మరో మూడు సార్లు చిట్టచివరి స్థానం. ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. 2018 వరకు అత్యంత నిలకడగా ఆడే జట్గుగా.. సైలెంట్‌గా ప్లే ఆఫ్స్ చేరే టీమ్‌గా గుర్తింపు పొందిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టు వైభవాన్ని కోల్పోయింది.


డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ జట్టును వీడిన తర్వాత దారుణంగా విఫలమవుతోంది. గత మూడు సీజన్లలో పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలోనే నిలిచింది. ఈ క్రమంలోనే ఈ సారి పూర్వ వైభవం అందుకొని విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లు కూడా మారడంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆన్‌పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్.. ఈ సారైనా టైటిల్ కొడుతుందో లేదో చూడాలి.!


సన్‌రైజర్స్ బలాలు..:

ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమ్ బలహీనతలపై ఫోకస్ పెట్టిన సన్‌రైజర్స్.. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్‌ను భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. భువనేశ్వర్, కమిన్స్‌, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌, మార్కో జాన్సెన్‌లతో బౌలింగ్ విభాగం భీకరంగా కనిపిస్తోంది.


ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, గ్లేన్ ఫిలిప్స్‌లతో బ్యాటింగ్ విభాగం డేంజరేస్‌గా ఉంది. కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు దక్కనున్న నేపథ్యంలో మార్క్‌రమ్ మరింత స్వేచ్చగా ఆడే అవకాశం ఉంది.


సన్‌రైజర్స్ బలహీనతలు..:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉన్న అతనిపెద్ద బలహీనత.. డొమెస్టిక్ ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం. అభిషేక్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటలేకపోయారు. దేశవాళీ ఆటగాళ్లు సత్తా చాటకుండా సన్‌రైజర్స్ టైటిల్ సాధించలేదు. తుది జట్టులో నలుగురు ఫారిన్ క్రికెటర్స్‌కు మాత్రమే అవకాశం ఉండనున్న నేపథ్యంలో.. దేశవాళీ ఆటగాళ్లు రాణించడం కీలకం.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):

మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షెహ్‌బాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్.


సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:

అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్( రూ. 6.80 కోట్లు), వానిందు హసరంగా(రూ. 1.5 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 20.50 కోట్లు), జయదేవ్ ఉనాద్కత్(రూ. 1.60 కోట్లు), ఆకాశ్ సింగ్(రూ. 20 లక్షలు), జాథవెద్ సుబ్రమణ్యన్(రూ. 20 లక్షలు)