తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో టెస్ట్‌లో భారత్ గెలిచింది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోరూట్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'టెస్ట్ సిరీస్‌లో భారత్ కూడా దూకుడుగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా టీమిండియా బలంగానే ఉంది. ఈ తరం క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ ప్లేయర్లు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వారు సాధించిన ఘనతలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. సీనియర్ ఆటగాళ్లు అయిన ఈ ఇద్దరూ మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తారు.
వారు భారీ స్కోర్లు చేయకుండా ఆపేందుకు వ్యూహాలు రచిస్తాం. త్వరగా ఔట్ చేయగలిగితే దాదాపు మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు. వారు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఆపడం చాలా కష్టం.'అని జోరూట్ చెప్పుకొచ్చాడు. ఇక మూడో టెస్ట్‌తో పాటు నాలుగో టెస్ట్‌కు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతితోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అలాగే తన రెండో బిడ్డకు సంబంధించిన విషయాలను కోహ్లీ గోప్యంగా ఉంచాడు.
ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అంతేకాకుండా అనుష్క శర్మ గర్భవతి అనే విషయం తెలియకుండా ఈ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే విషయాన్ని అతని సన్నిహితుడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిమానులకు తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.
అనుష్క శర్మ ప్రసవం పూర్తి కాకపోవడంతో కోహ్లీ తన లీవ్‌ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఇంగ్లండ్‌తో మూడు, నాలుగో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Social Plugin