ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన విషయం తెలిసిందే. మూడు, నాలుగు టెస్టులకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటం అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. విరాట్ గైర్హాజరీకి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో దూరమయ్యాడనే కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కూడా వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమవుతున్నాడు. మూడో సారి తండ్రి కాబోతున్న కేన్ మామ తన కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఆసీస్ మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు.
ప్రస్తుతం అతడు కివీస్ జట్టుతోనే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు (289 బంతులు), రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు (132 బంతుల్లో) చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ ఆసీస్ టీ20 సిరీస్‌కు లేకపోవడం న్యూజిలాండ్‌కు ప్రతికూలాంశమే.
అయితే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే విషయంపై కేన్ విలియమ్సన్ స్పష్టత ఇవ్వలేదు. స్వదేశంలో ఆసీస్‌తో న్యూజిలాండ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఇరు జట్లకు ఇదే ఆఖరి పొట్టిఫార్మాట్ సిరీస్. మరోవైపు విలియమ్సన్‌తో పాటు గాయం కారణంగా డారిల్ మిచెల్ కూడా ఆసీస్ టీ20 సిరీస్‌కు దూరమవుతున్నాడు.
Social Plugin